OSG NEWS

34వ వార్డు బుపేష్ నగర్ మధ్యం దుకాణం తొలగించాలి స్థానికుల చేస్తున్న పోరాటానికి ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు….

OSG NEWS 26.102024

34 వ వార్డు భూపేష్ నగర్ లో మద్యం దుకాణం తొలగించాలని కోరుతూ తొమ్మిది రోజులపాటు జరుగుతున్న పోరాటానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ మాట్లాడుతూ
34 వ వార్డు భూపేష్ నగర్ లో మద్యం దుకాణం తొలగించాలని కోరుతూ స్థానికుల చేస్తున్న పోరాటానికి ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం
నూతన
మద్య విధానం” లో భాగంగా ప్రాంతం లోకి నూతనంగా ఒక మద్యం విక్రయ దుఖానం కొందరు వ్యక్తులు దక్కించు కున్నారు అని తెలిపారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉంది. పూర్తి నివాస గృహాల మధ్య కొందరి స్వార్ధ ప్రయోజనాల కోసం మద్యం దుకాణం వచ్చింది.
మరీ ముఖ్యంగ ఈ ప్రాంత ఇలవేల్పు దేవాలయంకు అతి చేరువలోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం దేవాలయాలకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణం వుండ రాదు అని ఆమె గుర్తు చేశారు.ఇక మీదట మద్యం విక్రయించ డానికి వీలు లేకుండ తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *