OSG NEWS

ఏపీ ప్రజలకు బిగ్‌ అలెర్ట్‌… ఇసుక పాలసీపై సంచలన నిర్ణయం తీసుకుంది సర్కార్.  ఏపీలో ఇకపై ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ. సొంత అవసరాలకు ఎంతైనా వాడుకోవచ్చు… లిమిట్‌ క్రాస్‌ చేస్తే మాత్రం చర్యలు తప్పవ్‌… అంటోంది ఏపీ కేబినెట్‌. అవును… ఉచిత ఇసుక విషయంలో ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీనరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇసుక లేని జిల్లాల్లో మినరల్‌ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించింది. ఇసుక విధానంలో తమ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులతోనే NGT పెనాల్టీలు వేసిందని చెప్పారు. ఇసుక ఎవరికి వారు సొంతంగా లోడ్ చేసుకోవచ్చని, అయితే.. సొంత అవసరాలకే వాడుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్‌ పెడతామని హెచ్చరించారు కొల్లు రవీంద్ర.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా ఎన్డీయే ప్రభుత్వం 7 నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.10 లక్షల ఉద్యోగాలు స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు! వైసీపీపై ఆ పార్టీ నాయకులకు నమ్మకం లేదు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు 5 ఏళ్లలో విశాఖలో 5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు! విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమనే హామీకి కట్టుబడి ఉన్నాం సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో ఆలస్యమైనా నిజం గెలుస్తుంది! విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్