OSG NEWS

28కోట్లతో కేజీహెచ్ క్యాన్సర్ విభాగం ఆధునీకరణ

సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద

విశాఖపట్నం OSG NEWS 27.10.2024

స్థానిక కింగ్ జార్జి ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందజేస్తున్నామని ఇందులో భాగంగా క్యాన్సర్ విభాగాన్ని ఆధుణీకరించినట్లు కేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద తెలిపారు.ఆదివారం 30వ వార్డు సాలిపేట కమ్యూనిటీ హాల్లో చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన రొమ్ము క్యాన్సర్ అవగాహన శిబిరాన్ని
ఉద్దేశించి డాక్టర్ శివానంద్ మాట్లాడారు. కేజీహెచ్ లోని క్యాన్సర్ విభాగంలో 28 కోట్ల రూపాయల వ్యయంతో అధునాత
న సాంకేతిక పరికరాలు సి. టి సిములెటర్ మరియు బ్రాఖీ థెరపీ,లినాక్ మెషిన్లను సమకూర్చుకోగలిగినట్లు చెప్పారు.దీని సాయంతో క్యాన్సర్ వ్యాధికి మెరుగైన చికిత్సను అందజేస్తున్నామని ఐదు నుండి పది లక్షల రూపాయలు ఖర్చు కాగల వైద్యంకు
ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందజేస్తున్నామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రొమ్ము క్యాన్సర్ను మొదటి లేదా రెండో దశలో గుర్తించినట్లయితే వ్యాధి పూర్తిగా నయం కానుందని చెప్పారు చైతన్య స్రవంతి వాలంటీర్లు పాఠశాలల్లో అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేసి రొమ్ము క్యాన్సర్ పై పిల్లలకి చైతన్యం కల్పించాలని కోరారు.రొమ్ముల్లో గడ్డలు ఏర్పడిన సందర్భంలో నొప్పి ఉన్నా లేకపోయినా మెమోగ్రామ్ పరీక్ష చేయించుకున్నట్లైతే వ్యాధి నిర్ధారణ కానుందని తెలిపారు. అక్కచెల్లెళ్ల కోసం త్వరలో రొమ్ము క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని దీన్ని మహిళలు వినియోగించు కోవాలని కోరారు. కేజీహెచ్ క్యాన్సర్ విభాగం హెడ్ డాక్టర్ పాండురంగ కుమారి మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు విరివిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధిని నిర్ధారిస్తున్నామని క్యాన్సర్ నాలుగు స్టేజిల్లో ఉంటుందని మొదటి రెండు దశల్లో వ్యాధిని గుర్తిస్తే నయం అవుతుందన్నారు. మహిళలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రొమ్ముల్లో గడ్డలు ఏర్పడిన సందర్భంలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. చైతన్య స్రవంతి సేవా సంస్థ అధ్యక్షులుడాక్టర్ షరీన్ రహమాన్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా వివిధ వ్యాధులపై ఉచిత వైద్య. శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు ఎయిడ్స్,థైరాయిడ్ రొమ్ము క్యాన్సర్ పై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసామని అనుమానం వస్తే మహిళలు ఏమాత్రం ఆశ్రద్ద
వహించకుండా స్క్రీనింగ్ చేసుకున్నట్లయితే వ్యాధి నిర్ధారణ అవుతుందని అందుకు తగిన చికిత్స ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.రొమ్ము క్యాన్సర్ ను నిర్లక్ష్యం చేయరాదని ప్రతీ ఏటా అక్టోబర్ నెలలో ఈ క్యాన్సర్ పై మహిళల్లో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా రొమ్ము క్యాన్సర్ లక్షణాల బ్రోచర్ ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో చైతన్య స్రవంతి ప్రతినిధులు విజయ, రుకీయబాను, శారద.అనసూయ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *