OSGNEWS 26.10.2024
వెల్లంకి పంచాయతీ పెద్దల విజ్ఞప్తి మేరకు దివీస్ సంస్థ వారు తమ సి.ఎస్.ఆర్ నిధులు సుమారు రూ”30 లక్షలు వెచ్చించి 3 మినరల్ ప్లాంట్లను ఏర్పాటు చేసారు. వీటిలో లో బొడ్డపాలెం వై.ఎస్.ఆర్. కాలనీ ముందు ఉన్న ప్లాంట్ నీ దివీస్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం. ఎస్. రావు గ్రామ సర్పంచ్ శ్రీ ఉప్పాడ లక్ష్మణరావు మరియు ఎం. పి. టీ. సీ. శ్రీ పడాల అప్పలనాయుడు గ్రామ పెద్దల సమక్షంలో ప్రారంభించారు. అనంతరం వెల్లంకి గ్రామంలో కళ్యాణమండపం సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాంటును ఉప సర్పంచ్ శ్రీ కంచరపు శ్రీను మరియు మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ శ్రీ పిన్నింటి వెంకట రమణ ఇతర పెద్దలతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ ముత్యలరెడ్డి, బీజేపీ నాయకులు వై. ప్రసాద్ , జనసేన నుండి జి.గోవింద్ , మాజి ఎం. పి. టీ. సీ. పడాల రాము, బుల్లిరెడ్డి, అప్పలరెడ్డి మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దివీస్ సి. ఏస్. ఆర్. మేనేజర్ శ్రీ దేవళ్ళ సురేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సాధారణ త్రాగు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా శుద్ది చేసిన నీటిని వినియోగిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ సెక్రటరీ శ్రీ జి.ఎ.వి.శ్రీ రామ మూర్తి మాట్లాడుతూ పంచాయతీ పెద్దలు కోరిన వెంటనే దివీస్ వారు స్పందించి ఏర్పాటు చేసిన ఈ ఆధునిక శుద్ది నీటి ప్లాంట్లను అందరూ భాధ్యతగా కాపాడుకుంటూ నీటినీ వియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామని తెలియజేసారు. దివీస్ ప్రతినిధులు శేఖర్ బాబు, పేడినాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.