వాటర్ ట్యాంక్ నిర్మాణం కై శంకుస్థాపన
OSG NEWS ఆనందపురం మండలం – కణమాం పంచాయతీ (గోరింట్ల) – 26-10-2024 – శని వారం
ఆనందపురం మండలం కణమాం పంచాయతీ పరిధిలో గోరింట మరియు గొల్లల కణమాం జగనన్న కోలనీ గ్రామాలకు త్రాగునీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంక్ నిర్మాణం కై గత ప్రభుత్వం చొరవతో 2022 డిసెంబర్ నెలలో జలజీవన్ మిషన్ నిధులు 41 లక్షలు రూ నిదులు మంజారు చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ నిర్మాణం కై అప్పుడు కాంట్రాక్టు లేకపోవడంతో నిర్మాణం ఆలస్యం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత గతంలో విడుదల చేసిన నిదులకు గాను ఈరోజు పంచాయతీ నాయకులు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం వాటర్ ట్యాంక్ నిర్మాణం కై గత ప్రభుత్వ యంయల్ఏ నిదులు మంజారు చేయగా ప్రస్తుత అధికార పార్టీ యంయల్ఏ నిర్మాణం కై శంకుస్థాపన చేసినందుకు పంచాయతీ ప్రజలు సంతోషంతో హర్షం వ్యక్తం చేశారు
ఈ శంకుస్థాపన కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి కుమార్, ఇంజినీరింగ్ అసిస్టేంట్ సాయి కృష్ణ ,పినిశెట్టి సింహాచలం నాయుడు ,సర్పంచ్ ఆభోతు అప్పలరాము, ఎర్ర రాము,యంపిటిసి కృష్ణ,పల్ల రమణ,గ్రామ నాయకులు పెద్దలు, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు