జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగస్తుల ఆటల పోటీల ఎంపికలు
అనకాపల్లి OSG NEWS 25.102024
జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ పురుషులు మరియు స్త్రీ ఉద్యోగస్థులకు 18 క్రీడాంశములలో క్రీడా ఎంపికలు ఈ నెల 29 మరియు 30వ తేదీలలో జరుగనున్నాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎల్. వి. రమణ తెలియజేశారు. ఈ సివిల్ సర్వీసెస్ పోటీలు ఈ నెల 29.10.2024 మరియు 30.10.2024 తారీఖులలో ఎన్ టి ఆర్ స్టేడియం, కలెక్టరు కార్యాలయ వద్దగల గ్రౌండు, చిన్న హై స్కూల్, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం, డీ.సీ.ఎం.స్ గ్రౌండ్ మరియు జార్జ్ క్లబ్, అనకాపల్లి నందు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారు ఆధ్వర్యంలో జరుగునని తెలిపారు. జిల్లా స్థాయి సెలెక్షన్స్ లో ఎంపిక కాబడిన వారు రాష్ట్ర స్థాయిలో తేదీ: 06.11.2024 నుంచి 09.11.2024 జరిగే సివిల్ సర్వీసెస్ ఎంపికలలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడిన క్రీడాకారులు అఖిల భారత సివిల్ సర్వీసెస్ క్రీడల పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కావున అర్హులైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగస్థులు తమ యొక్క గుర్తింపు ధ్రువపత్రములతో తమ పేరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, అనకాపల్లి నందు నమోదు చేసుకోవలెను. పూర్తి సమాచారం కొరకు పి.వి నాగేశ్వర రావు, హ్యాండ్బాల్ కోచ్ -7382841568 మరియు జి. రాంబాబు, హాకీకోచ్, 9885530819 లను సంప్రదించాలని తెలిపారు.