విభిన్న ప్రతిభావంతుల హక్కులు చట్టం అమలు చేయాలి
జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్
అనకాపల్లి OSG NEWS 26-11-2024
చట్టప్రకారం విభిన్న ప్రతిభావంతు లకు కల్పించిన హక్కులను వారికి అందజేయాలని జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల హక్కులు అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం సహాయం, సంక్షేమ పధకాలు అమలు చేసున్నదని, వాటిని వారికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు తెలియజేసిన సమస్యలను శాఖలవారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేసారు.
విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.వి.బి. జగదీష్ మాట్లాడుతూ సంక్షేమ శాఖ ద్వారా మూడువేల మందికి ఉపకరణాలు అందజేసినట్లు తెలిపారు. అందులో 196 బ్యాటరీ వాహనాలు,600 వినికిడి యంత్రాలు ఉన్నాయని, ఇంకా 35 మందికి ఉపకరణాలు అందజేయవలసి ఉందన్నారు. ఉపకరణాల పంపిణీకి గ్రామాలలో సర్వే నిర్వహించి లబ్దిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. అవసరమైన దిన్యాంగులు అందరికీ ఉపకరణాలు అందించడంజరుగుతుందని తెలిపారు. ప్రభుత్వకార్యాలయాలలో విభిన్న ప్రతిభావంతులకు అవసరెమైన మౌళిక సదుపాయాలు కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్నదని, అందుకుగానుప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
కార్యక్రమంలో విభిన్నప్రతిభావంతుల ఉద్యోగుల సంక్షేమ సంఘం అద్యక్షులు కె. వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు రవికుమార్, అర్జునరావు, శ్రీరాములు తదితరులు మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్లలో తప్పుల సవరణకు చర్యలు తీసుకోవాలని, స్కిల్ డెవలప్మెంటు ద్వారా శిక్షణ అందించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, 70శాతం వైకల్యం గల వారికి కూడా నూరు శాతం సబ్సడీతో పాసులు మంజూరుచేయాలని, ప్రభుత్వం అందిస్తున్న పధకాలపై ప్రచారం నిర్వహించాలని, యూనిక్ ఐడి కార్డులు పంపిణీ పూర్తి చేయాలని, పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పి మోహనరావు, జిల్లా గ్రామీణాభివృది సంస్థ ప్రోజెక్టు డెరెక్టరు కె. శచీదేవి, మెప్మా ప్రోజెక్టు డైరెక్టరు ఎన్. సరోజిని, డుమా ప్రోజెక్టు డైరెక్టరు ఆర్. పూర్ణిమాదేవి, మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రోజెక్టు డైరెక్టరు కె. అనంతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషా రాణి తదితరులు పాల్గొన్నారు.