కేంద్ర హోంశాఖ సంప్రదింపులు కమిటీ సభ్యులు గా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీ.ఎం రమేష్
OSG NEWS 25.10.2024
వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీల్లో రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలకు చోటు లభించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంప్రదింపులు కమిటీ సభ్యులు గా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ నియమితులయ్యారు.కేంద్ర హోం శాఖ సంప్రదింపుల కమిటీకి చైర్మన్గా అమిత్ షా వ్యవహరించనున్నారు.ఈ కమిటీలో సహాయ మంత్రులు తో పాటు 15 మంది లోక్సభ, మరియు 13మంది రాజ్యసభ, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు గా ఉంటారు అని కేంద్రం నుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.దీనిపై సీ.ఎం రమేష్ స్పందిస్తూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కీలకమైన రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ,ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా మరియు ఇప్పుడు హోం శాఖ సంప్రదింపులో కమిటీలో సభ్యునిగా తనను నియమించినందుకుగాను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారికి మరియు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.తనను నమ్మి గురుతరమైన బాధ్యతలు అప్పగిస్తూ, ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.అదేవిధంగా అనకాపల్లి జిల్లావ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నాయకులకు,కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.