OSG NEWS

నేటి వరకు 1200 కేజీల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పట్టివేత

జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ

విశాఖపట్నం OSG NEWS 25-01-2024

విశాఖ నగరంలో జనవరి ఒకటి నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను జీవీఎంసీ పరిధిలో నిషేధించి నప్పటి నుండి ఇప్పటివరకు 1200 కేజీల ప్లాస్టిక్ వస్తువులను జీవీఎంసీ తనిఖీ బృందాలు పట్టుకోవడం జరిగిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

విశాఖలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రకటించిన నాటికి ముందుగా 45 రోజులు పాటు ప్రజలకు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు,చిన్నచిన్న వ్యాపారులకు, వినియోగదారులకు, ఉత్పత్తి, సరఫరాదారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వలన కలుగు అనర్ధాలపై, వాటి నిషేధము పై, ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగాలపై జీవీఎంసీ యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.

జనవరి 1వ తేదీ నుండి సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ చాలాచోట్ల నిషేధిత ప్లాస్టిక్ ను వినియోగిస్తున్న దుకాణాలను జీవీఎంసీ ప్రజారోగ్యపు అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, ఉద్యోగులు ఒక బృందముగా అన్ని జోన్లలో తనిఖీలు చేస్తూ దాడులు నిర్వహించగా ఇప్పటివరకు 1200 కేజీలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను సీజ్ చేయడమైనదని తెలిపారు. అన్ని జోన్ల సచివాలయాల పరిధిలో రు. 55 వేల ట్రేడ్ లైసెన్స్లు కలిగిన వ్యాపార, వాణిజ్యసముదాయాల వద్ద ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగం, లభించు వివరాలు కలిగిన క్యూఆర్ కోడ్ తో కూడిన ” సే నో టు ప్లాస్టిక్” అనే స్టిక్కర్లను ఒక్క రోజులోనే అతికించి ప్రజా అవగాహన కొరకు ఇప్పటికే ప్రదర్శించడమైనదన్నారు. అయినప్పటికీ ముఖ్యంగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు వద్ద, పలు ప్రాంతాలలో, ఆటోనగర్లో ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల వద్ద జివిఎంసి తనిఖీ బృందాలు దాడులు నిర్వహించగా దొరికిన ప్లాస్టిక్ ను సీజ్ చేయడమైనదన్నారు .
ఇకపై సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా జల్లెడ పట్టి పట్టుకుంటామని కావున ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికి పర్యావరణహితమైన ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగిస్తూ విశాఖను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని అదనపు కమిషనర్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *