వెల్లంకిలో వ్యక్తి అదృశ్యం మండలంలోని వెల్లంకి గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యమైనట్టు స్థానిక పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. సిఐ చింతా వాసు నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కామల రాజశేఖర్ రెడ్డి తన కుటుంబంతో వెల్లంకిలో జీవిస్తూ పాత సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులను ఎదు ర్కొంటున్నాడు. ఇది ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం రాజశేఖర్ రెడ్డి షాప్‌కి వెళ్తానని భార్య రాజ్యలక్ష్మికి చెప్పి ఇంటి వద్ద బయలు దేరాడు. వెళ్తూ.. వెళ్తూ నీకు ఇబ్బం దిగా ఉంటే మీ బంధువులను గాని సోదరులను గాని ఇంటి వద్దకు పిలిపిం చుకో అంటూ వెళ్లిపోయాడు. దీంతో అనుమానం వచ్చి భార్య రాజ్యలక్ష్మి షాపు వద్దకు వెళ్లి చూడగా భర్త రాజశేఖర్ రెడ్డి కనిపించలేదు. దీంతో అన్ని ప్రాంతాలు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ మేరకు ఆనందపురం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా సిఐ వాసు నాయుడు ఆధ్వర్యంలో హెచ్ సి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.