OSG NEWS మండలంలోని గంభీరం పంచాయితీ దుక్కవాని పాలెం గ్రామంలో డి పి ఎల్ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ను నిర్వహించారు. గ్రామం మొత్తం కలిపి 3 టీములను ఏర్పాటు చేసుకొని ఈ టోర్నమెంట్ని నిర్వహించుకున్నారు. ఈ టోర్నమెం ట్ ఆర్గనైజింగ్ చేసిన వారు ఎస్ ఎం జి ఈవెంట్స్, హరి డిజిటల్స్ వారి తండ్రి జ్ఞాపకార్థం దుక్క అప్పారావు జ్ఞాపకార్థంగా నిర్వహించారు. సంక్రాం తికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే యువత చెడు అలవాట్లు, చెడివేషణాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులతో పండుగను తమ గ్రామంలో జరుపుకునే వీధిగా ఉంటారని తెలియజేశారు. అనంతరం గెలిచిన టీమ్ కు బహుమతి ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.