మానవ హక్కుల పరిరక్షణే నా ద్యేయం అంటున్న జాతీయ డైరెక్టర్ స్వాతి సుధాకర్
తగరపువలస – 10-12-2024 – మంగళ వారం OSG NEWS 10-12-2024
*అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ చైర్మన్ డా.బి.గోపి నాయక్ , జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఓరగంటి సుబ్బారావు పిలుపు మేరకు అంతర్జాతీయ న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో జాతీయ విజిలెన్స్ కమిటీ డైరెక్టర్ భాగం స్వాతి సుధాకర్ ఆద్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమం చేపట్టి అన్నదాన సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ డైరెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు వీటిలో బాగంగా స్వాతి సుధాకర్,ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రాజ్ కుమార్ మరియు మానవ హక్కుల జాతీయ ఏక్టివిస్ట్ దొడ్డి ప్రసాద్ చేతులు మీదుగా పలువురు బిక్షాటన చేయవారికి బోజనం అందించారు అనంతరం డైరెక్టర్ స్వాతి సుధాకర్ మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కడ జరిగినా నేను ముందుండి వారి పక్షాన నిలబడి న్యాయం చేయడం జరుగుతుందని మానవ హక్కుల ముఖ్య ఉద్దేశం కూడా అదే నని అంతే కాకుండా మహిళా హక్కులు,బాలల హక్కులు కోసం వివిద కార్యక్రమాలు చేపట్టడతామని, రాజ్యాంగ ప్రాథమిక హక్కులు అందరికీ దక్కెలా చూస్తామని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో జాతీయ డైరెక్టర్ స్వాతి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి కె.రాజ్ కుమార్,జాతీయ ఏక్టివిస్ట్ దొడ్డి ప్రసాద్ పాల్గొన్నారు*