OSG NEWS 07-12-2024
బిజెపి బూత్ స్థాయి కమిటీల సమావేశం శనివారం
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలo పెద్దిపాలెం పంచాయతీలో బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ ఆధ్వర్యంలో 86,87,88 బూత్ కమిటీల సమావేశం జరిగింది.ఈ సమావేశమునకు విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు,ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా
ఎ.ఆర్.ఓ గా అధిష్టానం నియమించిన పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్ హాజరై గ్రామాల్లో బూత్ కమిటీలు వేగవంతం చేయాలని సూచించారు,ఈ సందర్భంగా పెద్దిపాలెం గ్రామ పంచాయతీలో పల్లి పేట,మచ్చవాని పాలెం 3 పోలింగ్ బూత్ లలో పూర్తిస్థాయి కమిటీలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనందపురం మండలంలో గల 57 పోలింగ్ బూత్ లలో 13 శక్తి కేంద్రాల్లో పోలింగ్ బూత్ లకు సంబంధించిన కమిటీ లను పూర్తిస్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీ లో వెయ్యాలని సూచించారు.ప్రధాని మోడి ప్రవేశ పెట్టిన వికసిత్ భారత్ లక్ష్యం.అన్ని మతాలకు కులాలకు వర్గాల వారీగా మహిళలకు నైపుణ్యం,ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి మరియు ఆరోగ్యము విషయమై ఆయుష్మాన్ భారత్ సామాన్యులకు వరముగా పెట్టిన పథకాలు ప్రజలకు మీ బూత్ లలో తెలియజేయాలని అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు మాట్లాడుతూ దేశం కోసం ప్రధాని నిరంతరం సేవలు అందిస్తున్నారని,విశ్వకర్మ యోజన,ముద్రయోజన, ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ద్వారా దేశంలో కోట్ల మంది లబ్ది పొందారు అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు:- పెద్దిపాలెం పంచాయతీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ప్రముఖులు, కార్యదర్శులు:- ఉప్పాడ నితిన్, మల్లరాపుకృష్ణ,ఉప్పడ శివ బిజెపి బూత్ నాయకులు పాల్గొన్నారు.