OSG NEWS

కుళ్ళిన మాంసం విక్రయిస్తున్న కామత్ హోటల్ పైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్పారావు, నందాజీలపై తక్షణ చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ కు బసవ కృష్ణ మూర్తి వినతి OSG NEWS 03-12-2024

కుళ్ళిన మాంసం విక్రయిస్తున్న బీచ్ రోడ్ కామాత్ హోటల్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ రాజేటి బసవ కృష్ణమూర్తి విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ కు వినతి పత్రం సమ ర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సోమవారం సాయంత్రం 06.44 నిమిషాలకు లాసెన్స్ బే వద్ద ఉన్న కామత్ హోటల్ వద్ద కౌజు కోడి మాంసాన్ని కొనుగోలు చేయడం జరిగిందని (బిల్ నెం. 988) 20 నిమిషాల తర్వాత అది తినే ప్రయత్నం చేయగా కుళ్ళిన వాసన రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావుకు (9912199284) ఫోన్ చేయగా
” నేను బయట ఉన్నాను ఇప్పుడు రాలేను మా డిపార్ట్మెంట్ కి సిబ్బంది కొరత ఉంది, రేపు ఉదయం వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేయండి అప్పుడు యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు మీకు అర్జంట్ అయితే నందాజీకి ఫోన్ చేయండి” అని  9849047761 నెంబర్ ఇచ్చారని నందాజీని సంప్రదించగా “ఇది నా పరిధిలోకి రాదు కుళ్ళిందని ల్యాబ్ కి పంపినా ప్రూవ్ చేయలేం మీరు జర్నలిస్ట్ కదా ఆర్టికల్ రాసుకోండి అని నిర్లక్ష్యంగా మాట్లాడారని అన్నారు ఒక పత్రిక సంపాదకుడైన తాను ఫోన్ చేస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేశారు మీడియా గ్రూప్ లో ఈ విషయం పోస్ట్ చేసిన అనంతరం అప్పారావు “నేను అక్కడికి వస్తున్నా అని ఫోన్ చేయండి జరిగిందని ఈ నందాజీ అనే అధికారి గత ఆరు సంవత్సరాలు గా విశాఖనగరంలోనే తిష్ట వేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కలుషిత ఆహారాన్ని కుళ్ళిన మాంసాన్ని అమ్ముతున్న హోటల్ లను ప్రోత్సహిస్తున్నారని కుళ్ళిన ఆహార పదార్థాలు విక్రయిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కామత్ హొటల్ పైన నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లకు కొమ్ముకాస్తున్న అవినీతి అధికారులపైన తక్షణ చర్యలు తీసుకోవాలని కలుషిత ఆహార విక్రయాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, అదేవిధంగా నగరం లోని స్టార్ హోటళ్ళ ముసుగులో నిల్వ ఉంచిన కుళ్ళిన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్ళ పై నిరంతరం పర్యవేక్షించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed