యలమంచిలి OSG NEWS 01-11-2024
- అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నిత్యం సమాజంలో ఉన్నదానిలో నలుగురు మంచి కోరుకునే ఏ బి చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజు అనకాపల్లి జిల్లా నర్సింగ్ బిల్లి గ్రామంలో ఏబి చారిటబుల్ ట్రస్ట్, మరిడి మహాలక్ష్మి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎంవిపి, అనిల్ నీరుకొండ హాస్పిటల్ సంగివలస, వందే భారత్ బ్లడ్ సెంటర్ గాజువాక సహకారంతో ఉచిత వైద్య శిబిరం మరియు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా ఫౌండర్ ఏబి చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ ఎంఎస్ శాంతి స్వరూప్, మున్సిపల్ చైర్మన్ మరియు విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ పిల్ల రామకుమారి, రాష్ట్ర ప్రెసిడెంట్ ఏ ఎస్ పి పార్టీ భీమ్ ఆర్మీ వి ఇంద్ర శేఖర్, విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏబి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ ఎంఎస్ శాంతి స్వరూప్ మాట్లాడుతూ వైద్యం అందరికీ అందించడమే మా యొక్క సమస్త సంకల్పమని రక్తదానంతో మరొక ప్రాణాన్ని కాపాడవచ్చని ఇటువంటి కార్యక్రమాలు పట్టణాల నుండి పల్లెలకు అవసరమని దీనికి అన్ని విధాలుగా సహకరించిన మరిడి మహాలక్ష్మి ఉత్సవ కమిటీ వారికి వైద్య బృందానికి మాకు వెన్నంటే ఉండే స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏబి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వైద్య బృందం మారిడీ మహాలక్ష్మి ఉత్సవ కమిటీ తూట్ట నాగశ్రీనివాస్ అధ్యక్షతన ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహించారని దీనిని మాటల్లో వర్ణించలేరని కరతాల ధ్వనులతో ఆయనను అభినందించారు తదితరులు పాల్గొన్నార