గుంతలు లేని రోడ్ల సాధనకు ప్రభుత్వం కృషి….!
– నాగోతి నాగమణి హర్షం
ఆనందపురం OSG NEWS SUNDAY 03.11.2024.
రాష్ట్ర ప్రభుత్వం పట్టణ గ్రామీణ రహదారుల్లో గుంతలు లేని రోడ్లుగా మార్పు చేయడానికి 826 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం పట్ల విద్యావంతురాలు, టిడిపి నాయకురాలు నాగోతి నాగమణి హర్షం ప్రకటించారు. వచ్చే సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో రాష్ట్రంలో రోడ్లు నరకానికి రహదారులుగా మారాయని ఈ పరిస్థితిని తమ ప్రభుత్వం అధిగమిస్తుంది అన్నారు. రోడ్లు అభివృద్ధి ద్వారా వ్యాపార వాణిజ్య రంగాలు కూడా మెరుగుపడతాయన్నారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.