OSG NEWS

పీఎం స్వనిధి పథకం అమలులో ఉత్తమ పనితీరుకు జీవీఎంసీ కి రాష్ట్రస్థాయి అవార్డు

విశాఖపట్నం OSG NEWS 29-10-2024

 

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ 2023- 24వ సంవత్సరమునకు గానూ పీఎం స్వనిధి పథకాన్ని అమలు పరచడంలో జీవీఎంసీ రాష్ట్రస్థాయి అవార్డును పొందిందని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ యు సి డి- ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం సత్యవేణి తెలిపారు. మంగళవారం ఈ రాష్ట్ర స్థాయి అవార్డును రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చేతులమీదుగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ అందుకోవడం జరిగిందని ఆమె తెలిపారు.

 

జీవీఎంసీ పరిధిలో పిఎం స్వనిది పథకంలో ప్రజలకు లోన్లను మంజూరు చేయుటకు గాను 20697 దరఖాస్తులు మూడు దశల్లో రిజిస్టర్ చేయడం జరిగిందని , వాటిని అమలు పరచడంలో యుసిడి విభాగం అధికారులు , ఉద్యోగులు ప్రత్యేక కృషిని కనబరిచారని ఆమె అన్నారు. పియం స్వనిది పథకం అమలులో ఉత్తమ పనితీరును కనబరిచినందుకుగాను జీవీఎంసీ అర్బన్ లోకల్ బాడీ నకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కిందని కమిషనర్ ఆనంద వ్యక్తం చేశారన్నారు.ఈ అవార్డును అందిస్తూ రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి .నారాయణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడంలో జీవీఎంసీ యంత్రాంగం మరింత శ్రద్ధను కనపరచాలని జీవీఎంసీ కమిషనర్ ను అభినందిస్తూ పేర్కొన్నారని కమిషనర్ తెలిపారని ఆమె తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *