OSG NEWS

నభూతో న భవిష్యతి అనేలా వుండే సినిమా కంగువ

– రాజ మౌళి స్ఫూర్తితోనే పాన్ ఇండియా సినిమా

– నవంబర్ 14 న విడుదల

– హీరో సూర్య

విశాఖ పట్నం: OSG NEWS 27.10.2024

కంగువా సినిమా యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. వైజాగ్ కాంగువా మీట్ పేరిట విశాఖలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, కే వీ ఎన్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా కంగువ సినిమా నిర్మించారు.
సూర్య హీరో గా , దిశా పటాని హీరోయిన్ గా శివ దర్శకత్వంలో నిర్మాతలుగా వంశీ, ప్రమోద్, కె.ఈ. జ్ఞానవేల్ రాజా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రం కంగువా చిత్ర ప్రమోషన్ లో భాగంగా * ఆదివారం హోటల్ నోవాటల్లో* మీడియా సమావేశం నిర్వహించారు. హీరో సూర్య, నిర్మాత కె.ఈ. జ్ఞానవేల్ రాజా, నటుడు అవినాష్, పాల్గొన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ, ఈ సినిమా నవంబర్ 14 న విడుదల అవుతుంద న్నారు. దేవి శ్రీ ప్రసాద్ వీనుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు. విశాఖ అంటే తనకు ఎంతో ప్రేమ అని సంతొషం వ్యక్తం చేశారు. తాను 2015లో సింగం – 3 సినిమా షూటింగ్ కోసం విశాఖలో బీచ్, రైల్వే స్టేషన్ లో షూటింగ్ చేశాం అన్నారు. 1985 లోకూడా సింధు భైరవి సినిమా కోసం కూడా విశాఖ వచ్చాను అని గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు కూడా విశాఖ వచ్చారు. విశాఖ గురించి గొప్పగా చెప్పే వారు. ఎన్నో మధుర స్మృతులు వున్నాయి. తన పేరు శరవణ తరువాతి కాలంలో సూర్య గా మారింది అన్నారు. 2012లో వచ్చిన బాహు బలీ సినిమా దక్షిణాది నుంచి పాన్ ఇండియా సినిమాలకు శ్రీ కారం చుట్టింది. తెలుగులో శౌర్యం సినిమా తీసిన దర్శకుడు శివ కగువ సినిమా ఎంతో గొప్పగా తీశారు అని పేర్కొన్నారు. హీరో నాగార్జున కూడా ఈ సినిమా ను మెచ్చుకున్నారు అని గుర్తు చేశారు.
700 ఏళ్ల క్రితం జరిగిన కథ నడుస్తుంది. మని పవర్ కోసం పోరాటం జరుగుతుంది. అవినాష్ తండ్రి పాత్రల్లో నటించారు. 3 వేల మంది అంకిత భావంతో పని చేసారు.
రాత్రి పూట చీకట్లో షూటింగ్ చేశాం. బాబీ డియోల్ విలన్ పాత్రలో వొదిగిపోయారు అని ప్రశంసించారు. చిన్న నాటి నుండి కమల్ హాసన్ తన అభిమాన హీరో అన్నారు. 170 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను. డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ తో తొలిసారిగా పని చేయడం సంతోషంగా వుంది. విజయం చిహ్నాలు చేతి భుజం మీద వుంటాయి అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నిర్మాత కె.ఈ. జ్ఞా న వేల్ మాట్లాడుతూ, వెయ్యి ఏళ్ల క్రితం ఐదు తెగల మధ్య జరిగిన పోరాటం నేపథ్య వుంటుంది. ఆంధ్రా ప్రేక్షకుల మీద నమ్మకం తోనే రూ.2 వేల కోట్లు వసూలు చేయడం ఖాయం అని ప్రకటించాను అన్నారు. ఇది మా టీమ్ డ్రీమ్. ఇటువంటి సినిమాలు తీయడానికి స్ఫూర్తి విజనరి డైరెక్టర్ రాజ మౌళి అని తెలిపారు. తెలుగు లో కూడా మంచి హైప్ వుంది. డిల్లి, ముంబాయి, చెన్నై, హైదరా బాదు ప్రాంతాల్లో ప్రమోషన్ వర్క్ చేశాం. 1200 ఏళ్ల క్రితం జరిగిన కథ తంగ లాన్ , 700 ఏళ్ల క్రితం జరిగిన కథ కంగువ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నటుడు అవినాష్ మాట్లాడుతూ, సూర్య తో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. నిర్మాత అభిరుచి గల నిర్మాత అని మరోసారి నిరూపించుకున్నారు. షూటింగ్ లో వాతావరణం మార్పులు వుండేవి. నటులు అందరూ స్వంత సినిమాగా భావించి పని చేసారు అని కొనియాడారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *