OSG NEWS 25.10.2024
నీటి వనరులు రక్షించాలని జిల్లా కలెక్టర్ కీ వినతిపత్రం ఇచ్చిన ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి నాయుకులు జల వనరుల పరిరక్షణ యాత్ర లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కి జిల్లా పరిధిలో ఉన్న నీటి వనరులును రక్షించాలని వాగులు నదులు అక్రమణకు గురి కాకుండా చూడాలని అలాగనే పర్యాటకులు వల్ల నీరు కలుషితం కాకుండా చూడాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపద్యక్షులు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రానికి కలక్టర్ స్పందిస్తూ నీటి వనరులను రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని జలవనరులకు సంబందించిన అన్ని శాఖలను సమయక్తం చేయవలసిందిగా క్రింద స్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది ఈ జల యజ్ఞం విజయవంతంగా సాగాలంటే అన్ని ప్రాంతాల్లో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితికి అన్ని విధాల సహకరించడానికి మా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఉద్యమం తీవ్రతరం చేయడానికి బాధ్యతాయుతమైన పౌరులు ఈ సమితిలో చేరితే భవిష్యత్తు తరాలకు సాగునీరు తాగునీరు అందించే వారు అవ్వుతారని అన్నారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు దేవుపల్లి సీతారాం విజయనగరం జిల్లా అధ్యక్షులు ఐ గోపాలరావు తదితరులు పాల్గున్నారు