*ఉత్తరాంధ్ర చెరువులు రక్షణకు ప్రజల సహకారం కావాలి:- జాగరపు ఈశ్వర్ ప్రసాద్* కబ్జాలు గురవుతున్న చెరువుల రక్షణ కోసం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి చేస్తున్న ఉత్తరాంధ్ర జల వనరుల పరిరక్షణ యాత్ర 11వ రోజులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో చెరువులు పరిశీలన చేయడం జరిగింది ఈ యాత్రలో గత 11 రోజులుగా ఉత్తరాంధ్రలో కబ్జాలకు గురవుతున్న చెరువులు నిర్వహణ లోపంతో నడుస్తున్న ప్రాజెక్టులు, కలుషితం అవుతున్న నదులను ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నాయకులు పరిశీలన చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ కబ్జాలకు గురవుతున్న చెరువుల రక్షణకు ప్రజలు సహకారం కావాలని అన్నారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ వ్యవసాయానికి సాగునీరు ప్రజలకు త్రాగునీరు అందించడం కోసం సాగునీటి ప్రాజెక్టులు కట్టించిన ప్రభుత్వాలు వాటి నిర్వహణ గాలికి వదిలేసి నీరును వృధాగా సముద్రపాలు చేస్తున్నారని కనీసం నిర్వహణ కూడా సరిగ్గా చేయికపోవడం వల్ల నీరు వృధాగా పోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు చక్రవర్తి విశాఖపట్నం అధ్యక్షులు దేవుపల్లి సీతారాం, అనకాపల్లి అధ్యక్షులు నారాయణరావు, విజయనగరం జిల్లా అధ్యక్షులు ఐ గోపాలరావు తదితరులు పాల్గున్నారు