అపరిశుద్ధంతో మురుగునీటీ కాలువ…
పట్టించుకోని పంచాయతీ అధికారులు
మండలంలో బంటుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో
సి ఎస్ బి బ్యాంక్ వద్ద ఉన్న మురుగునీరు కాలువ సుమారు ఒక సంవత్సరం నుండి చెత్తాచెదారం వ్యర్ధాలతో దుర్వాసన వాహనదారులను ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. అప్పట్లో ఇంజనీరింగ్ అధికారులు నాయకులు పనులు చేపట్టినప్పటికీ మురుగు కాలవ వెళ్లే విధంగా చర్యలు చేపట్టలేదు అందువల్ల మురుగునీరు అంతా ఒక చోటకు చేరి కాలువ చెత్తాచెదారంతో నిండిపోయింది దానికి తోడు దోమలు, కుళ్ళిన వ్యర్థాలతో దర్శనమిస్తుంది ఎప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు చొరవ తీసుకొని మురుగునీరు పోవడానికి వెళ్లే మార్గాలను అన్వేషించాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరుచున్నారు.