అనకాపల్లి, అక్టోబరు 24: రబీ పంటకు సంబంధించి పంటభీమా పధకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ తెలిపారు. పంటల భీమాపై గురువారం జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖఅదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింటు కలెక్టరు ఎం. జాహ్నవి, వ్యవసాయ అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ పంటల బీమాకు సంబంధించి ఇతరుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా ప్రీమియం కట్టుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు, కౌలు రైతులకు ప్రభుత్వపధకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది కౌలురైతులుండగా రెండులక్షలమందికి మాత్రమే బ్యాంకురుణాలు అందాయని, మిగిలిన వారి పేర్లు లిస్టులకు దగ్గరలో గల బ్యాంకులకు లింకుచేసి వారికి కూడా రుణాలు అందించుటకు అదికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంటల భీమా చేసుకొనుట వలన కలిగే ఉపయోగాలను రైతులకు తెలియజేసి, వారికి అవగాహన కల్పించాలన్నారు. గడువులోగా పంటల భీమా ప్రీమియం చెల్లించే విధంగా రైతులను అప్రమత్తంచేయాలని తెలిపారు. రబీకి సంబంధించి జీడిపంటకు నవంబరు15వతేదీ ఇతర పంటలకు డిశంబరు 15తేదీ ఆఖరుతేదీగా నిర్ణయించడంజరిగిందని, గడువులోగా ప్రీమియం చెల్లించి పంటనష్టం జరిగితే పరిహారం పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఎం. జాహ్నవి, వ్యవసాయఅధికారులు, ఉద్యానశాఖఅధికారులు పాల్గొన్నారు.
జారీః జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి