ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ కి సంబంధించి శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సామాజిక తనిఖీ లో భాగంగా 2023 ఏప్రిల్ 1 నుంచి మర్చి 31 2024 పనులు 95 తనికి చేసి గ్రామ సభ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ మరియు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు మరియు గుడిలోవ నీటి సంఘం వైస్ చైర్మన్ ముదిలి చిన్నయ్య పాత్రుడు పాల్గొన్నారు. నిధుల వినియోగంతో పాటు పనుల్లో పారదర్శకతకు ప్రతి పంచాయతీలోనూ ఏటా సామాజిక తనిఖీలు చేస్తుంటారని ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీ ఎ. తిరుమల రావు,
టి.ఎ ఓ.సత్య,ఫీల్డ్ అసిస్టెంట్ పల్లి శివ, ఆడిట్ డిఆర్పి బి.రాజు పంచాయతీ ఇంజనీర్ నాగరాజు, మేట్లు మరియు ప్రజలు పాల్గొన్నారు