OSG NEWS 10-12-2024 ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వీలైనంత త్వరగా గ్రామ-వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అటు జనన-మరణ ధ్రువపత్రాలు పొందేందుకు JAN 1న కొత్త వెబ్సైటును ప్రారంభించాలన్నారు.