వందేళ్ల ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా ఉండాలి
తేదీలు ఫిబ్రవరికి మార్పు
సీఎంను ఆహ్వానించాలని నిర్ణయం
హైస్కూల్ కమిటీతో సమావేశమైన భీమిలి ఎమ్మెల్యే గంటా
విశాఖపట్నం భీమిలి OSG NEWS 02-12-2024
భీమిలి హైస్కూల్ వందేళ్ల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించుకునేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. ఎం.వి.పి. కాలనీలోని ఆయన నివాసంలో హైస్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని చాలా తక్కువ స్కూళ్లకు వందేళ్ల చరిత్ర ఉందని పేర్కొన్నారు. స్కూల్ భవనానికి అవసరమైన ఆధునికీకరణ పనులను చేపట్టడానికి తగిన సమయం లేకపోవడం వల్ల స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ నిర్ణయం మేరకు వందేళ్ల ఉత్సవాల తేదీలను ఈనెల 28, 29 నుంచి ఫిబ్రవరి 22, 23 లకు వాయిదా వేసినట్టు ప్రకటించారు. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు. హైస్కూల్ పెయింటింగ్, రిపేర్లు తదితర పనుల కోసం ప్రభుత్వ నిధులతో పాటు సి.ఎస్.ఆర్., ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి నిధులను సేకరించి ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో భీమిలి ఆర్డీఓ కె.సంగీత్ మాధుర్, డి.ఇ.ఓ. ప్రేమ్ కుమార్, జోనల్ కమిషనర్ ప్రేమ ప్రసన్న వాణి, ఎస్.ఎస్.ఎ. ఈ.ఈ. నరసింహారావు, దివీఎస్ ప్రతినిధి సురేష్, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ గాడు అప్పలనాయుడు, పార్వతీశం, బసవ కృష్ణమూర్తి, మండల టిడిపి అధ్యక్షుడు డి.ఎ.ఎన్.రాజు, పార్టీ నాయకులు గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.