శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో స్వాములకు భావానీలకు 41 రోజులు పాటు అయ్యప్ప సేవా సంఘము ఆధ్వర్యంలో అన్నధానం జరిపించిన పిళ్ళా వెంకటరమణ గురుస్వామి తదితరులకి అన్నదానం ముగింపు సందర్భంగా ఘన సన్మానం,
OSG NEWS 02-12-2024
విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో పిళ్ళా వెంకటరమణ (అన్నమయ్య) గురుస్వామి పీఠం ఆధ్వర్యంలో తేదీ 17/10/2024 న అయ్యప్ప స్వామి మాలలు స్వీకరించి అమ్మవారి ఆలయంలో పీఠం ఏర్పాటు చేసి ఆరోజు నుండి శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం, అయ్యప్ప స్వామి వారి పీఠం ఆధ్వర్యంలో స్వాములకు, భవానీలకు మధ్యాహ్నం భోజనం (బిక్ష ) ప్రారంభించి అన్నదానం మండల కాలం రోజులు పెట్టడం జరిగింది, ప్రతీ రోజు సుమారు 400 వందలు నుండి 600 వందలు మంది స్వాములు భవానీలు వరకు (బిక్ష) భోజనాలు స్వీకరించారు, నేటితో స్వామి వారి దీక్ష పూర్తి కావడంతో ఇరుముడులు కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరారు, ఈ సందర్బంగా గురుస్వామి పిళ్లా వెంకటరమణ స్వామిని, పిళ్ళా శ్రీను స్వామిని, పిళ్ళా సతీష్ స్వామిని, నాగోతి అప్పారావు స్వామిని, ఈ నలభై ఒక రోజులు వంటలు చేసిన రామారావు స్వామిని, సంతోష్ స్వామిని శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, స్వాములు ఘనంగా సన్మానించారు,
ఈ సందర్బంగా వెంకటరమణ గురుస్వామి మాట్లాడుతూ మా అయ్యప్ప పీఠం స్వాములు, భక్తులు, అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు అందరి సహాయ సహకారాలతో నలభై ఒక రోజులు అన్నధానం పూర్తి చేశామని తెలిపారు, అలాగే గత పదిహేడు సంవత్సరాల నుండి ప్రతీ సంవత్సరం ఈ విధంగా జరిపిస్తున్నామని తెలిపారు.
అలాగే ఈ రోజు అన్నదానం ముగింపు రోజు శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ, ప్రముఖ బిల్డర్ ఆర్.వై.కుమార్ దంపతులు, జగుపిల్లి శివ కుమార్ దంపతులు సహకారంతో ఈరోజు ముగింపు రోజు బిక్ష (అన్నదానం) కార్యక్రమం జరిపించడం జరిగింది, ఈరోజు అన్నదానంలో సుమారు 800 వందల మంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు,
ఈరోజు జరిగిన అన్నదానం కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్ళా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్ళా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, పిళ్ళా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, జాయింట్ సెక్రటరీ బంక వాసు, సభ్యులు పోతిన పైడిరాజు, గూడెల రాజు, పొట్నూరి హరికృష్ణ, నాగోతి అప్పలరాజు,
చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్ళా సత్యనారాయణ, జగుపిల్లి నానీ,
ముఖ్య సభ్యులు పిళ్ళా పోతారాజు, జగుపిల్లి అప్పారావు, పి.వెంకటరమణ, పోతిన రాంబాబు, అప్పారావు, ఆలయ అర్చకులు పట్నాల హరి ప్రసాద్ శర్మ, మూర్తి శర్మ మరియు అధిక సంఖ్యలో స్వాములు, భావానీలు, భక్తులు పాల్గొన్నారు