OSG NEWS 26-11-2024 75వ భారత రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా కింగ్ జార్జ్ ఆసుపత్రి నందు సూపరింటెండెంట్ డా.పి. శివానంద బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్ర పటమునకు పూల మాల వేసి భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనముగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం నందు డా.పి. శివానంద గారు ప్రసంగిస్తూ భారత రాజ్యాంగం గురించి మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి గురించి పలు విషయములు తెలియజేసి, తరువాత వైద్యులు మరియు ఇతర సిబ్బంది తో భారత రాజ్యాంగ పీటిక ను చదివించి ప్రతిజ్ఞ చేయించినారు.
ఈ కార్యక్రమం నందు సూపరింటెండెంట్ డా.పి. శివానంద గారితో పాటుగా డా.జగదీష్ కుమార్, DM&HO, విశాఖపట్నం, డా.మెహర్ కుమార్, డిప్యూటీ సి యస్ ఆర్ యమ ఓ , డా.డి.భాస్కర్ , RMO, డా.రాజేష్. RMO, డా,కిరణ్ కుమార్,హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ , శ్రీ.మంగరాజు , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, శ్రీ.పి.యమ.జవహర్లాల్,మేనేజర్, శ్రీ.గార సత్యనారాయణ, అకౌంటెంట్ మరియు ఇతర మినిస్టేరీయల్ సిబ్బంది మరియు నర్సింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.