సైనికుల కుటుంబాల సంక్షేమానికి జిల్లా సైనిక్ బోర్డ్ నిరంతరం కృషి చేయాలి.
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం OSG NEWS 22.11.2024
సైనికుల కుటుంబాల సంక్షేమానికి జిల్లా సైనిక్ బోర్డ్ నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా సైనిక బోర్డు ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అధ్యక్షతన జిల్లా సైనిక్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యుద్ధ వితంతువులు/యుద్ధంలో అంగవైకల్యం పొందిన సైనికులకు ఇళ్ల స్థలాలు మంజూరు, ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ భూమి కేటాయింపు, Gallantry అవార్డు విన్నర్స్ వారికి ఎక్స్గ్రేషియా మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారిని ఆదేశించారు. అదే విధంగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం నందు వాచ్మెన్ పోస్ట్ భర్తీ తదితర అంశాలను సమీక్షించి అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి బిహెచ్ భవాని శంకర్, లెఫ్ట్నెంట్ కల్నల్ ఎస్.ఎం. భాష, జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. సత్యానందం, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.