OSG NEWS

గత ప్రభుత్వం విశాఖలోని శారదాపీఠానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూపై రకరకాల వాదనలూ ఊపందుకున్నాయి. విశాఖ జిల్లా భీమిలి పట్టణం సమీపంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న 15 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించింది. ఒక ఎకరా భూమికి కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకుని… ఆ భూమిని శారదా పీఠానికి ఇచ్చేసింది. అంటే మొత్తం 15 లక్షల రూపాయలకే 15 ఎకరాలను పిఠానికి గత ప్రభుత్వం అప్పగించింది. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు టీడీపీ నేతలు ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశారు. భీమిలి సమీపంలో ఎకరా భూమి 15 కోట్లకు పైగా ఉందని ఇటు అధికారులు కూడా చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *