అదికధరలను ఆరికట్టాలి
తగ్గించిన పాల ధరలను వెంటనే పెంచాలి
OSGNEWS 25.10.2024
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను ఆరికట్టాలని,విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరను వెంటనే పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె,లోకనాధం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం మండల కార్యదర్శి బిటి దొర అద్యక్షతన జరిగింది అనంతరం వారు మాట్లాడారు,నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగి పోయాయని సామాన్య మద్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిపై నవంబరు 1 నుండి 15 వరకు జిల్లా వ్యాప్తంగా అందోళన చేయాలని పార్టీ శ్రేనులకు పిలుపు నిచ్చారు అదేవిధంగా,విశాఖ డెయిరీ యాజమాన్యం పాల ఉత్పత్తి దార్లనుండి సేకరిస్తున్న పాల ధరలను తగ్గించడం అన్యా యమన్నారు,నేడువ్యవసాయ రంగం లాభ సాటిగా లేక పోవడం వలన ఉత్తరాంధ్ర జిల్లాలోని సుమారు 3 లక్షల మంది రైతులు పాడి పై ఆధార పడి ఆవులను మేపు కొని తమకుటుంబాలను పోషించు కుంటున్నారని తెలిపారు ఈరోజు డెయిరీ ఇస్తున్న ధర ఏమాత్రం గిట్టుబాటుగా లేదన్నారు. కనీసంగా ఆవుపాలకు లీటరకు 50 రూపాయలు,గేదె పాలకు లీటరకు 100 రూపాయలు ఇవ్వాలి.కానీ విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాలుకి లీటరుకు మూడు రూపాయలు తగ్గించడం వలన పాడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.పశు పోషణ వ్యయం విఫరీతంగా పెరిగినప్పటికీ విశాఖ డెయిరీ యాజమాన్యం పాల సేకరణ ధరలు పెంచకుండా ధరలను,తగ్గించడం దుర్మార్గ మన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పాల ధరలను పెంచి పాడి రైతులను ప్రోత్సహించాల్సిన విశాఖ డెయిరీ యాజమాన్యం పాల సేకరణ ధరలను తగ్గించడంతో పాడి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులతో సంప్ర దించకుండా ఏకపక్షంగా పాల సేకరణ ధర తగ్గించడం సరికాదని తెలిపారు గత రెండేళ్లుగా పాడి రైతులకు బోనష్ ఇవ్వ కుండా తీవ్ర ద్రోహం చేసిందని తెలిపారు.వెంటనే విశాఖ డెయిరీ యాజమాన్యం తన నిర్ణయాన్ని వెనక్కి తీసు కొని తగ్గించిన ఆవు పాల ధరను పునరుద్దరించక పోతే పాడి రైతులను సమీకరించి ఉద్యమిస్తామని తెలిపారు అదేవిధంగా నిత్యావసర వస్తువులు ధరలు వీపరీతంగా పెరిగి పోయాయని దీనిపై ప్రజల ను కూడా గట్టి ఆందోళన చేస్తామని తెలిపారు ఈకార్యక్రమంలో జె,సన్నిబాబు మూలగుమ్మి ఎర్రునాయుడు షేక్ అప్పాజి సిహెచ్ దేముడు కె ఈశ్వరావు వి దోంగబాబు జె ఈశ్వరావు డి దాసు జె పోతురాజు తదితరులు పాల్గొన్నారు,