క్రీడలతో ఆరోగ్యం
ఇంటర్ కాలేజీ వాలీబాల్ పోటీల్లో గంటా
భీమిలి OSG NEWS 26-11-2024
క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు ఆలోచన శక్తి పెంపొందుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి కాలేజీలో ఇంటర్ కాలేజీ వాలీబాల్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలవాలనే పట్టుదలతో పాటు ఓటమిని తట్టుకునే మనో ధైర్యాన్ని కూడా క్రీడలు అందిస్తాయని చెప్పారు. కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి కాలేజీ దశ కీలకమైందని, భవిష్యత్ గురించి పెద్ద కలలు కని వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడాలని సూచించారు. తల్లిదండ్రులు, దేశం గర్వ పడేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యతో పాటు క్రీడా వ్యవస్థను కూడా వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. నాణ్యమైన విద్యా బోధన కావాలంటే శక్తిమంతమైన టీచింగ్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ రోణంకి మంజుల, కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, నొడగల అప్పారావు, కూటమి నాయకులు డి.ఎ.ఎన్.రాజు, గాడు అప్పలనాయుడు, గంటా నూకరాజు, నరేంద్ర, రామానాయుడు, శాఖారి శ్రీనివాస్, ఎమ్మార్వో రామారావు తదితరులు పాల్గొన్నారు.