OSG NEWS 26-11-2024 ఎస్వీఎల్ఎన్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఆర్ట్స్ విభాగము వారి ఆధ్వర్యంలో , ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ మంజుల అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ విష్ణుమూర్తి, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ బి సహదేవుడు పాల్గొని భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను విద్యార్థులు అందరికీ తెలియజేశారు, అనంతరం రాజనీతి శాస్త్ర విభాగం ఇన్చార్జ్ శ్రీమతి కె పార్వతీదేవి ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ అందరి చేత చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.