OSG NEWS

పంపకాల పంచాయితీ

OSG NEWS భీమిలి

 

అయిదు సంవత్సరాల పాటు యుద్ధంతో విధ్వంసం జరిగితే ఏ దేశమైనా ఎలా వుంటుందో ఇప్పుడు మన రాష్ట్రం కూడా అలాగే ఉంది… తిరిగి దానిని గాడిలో పెట్టడం అనేది అంత సులువుగా జరిగే పని కాదు… కొత్త ప్రభుత్వం ఆ పనిలోనే ఉందనేది సుస్పష్టం… రాజధాని లేకుండా చేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి వైపు నడపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు మొదలయ్యాయి… అమరావతి కోసం పెద్దాయన, ఐటి కంపెనీల కోసం చిన్నాయన, కేంద్రంతో మాట్లాడి వివిధ ప్రాజెక్టులను వేగవంతం చేసే పనిలో పవన్ కళ్యాణ్… ఇలా ముగ్గురూ కూడా రాష్ట్రం కోసం పరుగులు పెడుతుంటే… ఇంకొక పక్క తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్ములో వాటాలు తేలక మరొక ముగ్గురు వాదులాడుకుంటున్నారు… పైపెచ్చు ఆ బురదను తెచ్చి రాష్ట్రం కోసం పని చేసుకుంటున్న వాళ్ళ నెత్తిన వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు… ఏమైనా అంటే అన్ని కుటుంబాలలో ఉండేవే కదా… మా కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతున్నారు అని ఏడుపులు… అసలు కుటుంబాల్ని రాజకీయాల్లోకి లాగడం మొదలెట్టిందే మీరు కదా… అంతకు ముందు రాజకీయాలు చాలా హుందాగా ఉండేవిగా… ఇప్పుడు ఈ గగ్గోలు దేనికి… ఆ ఆస్తులన్నీ మీకు వారసత్వంగా వచ్చినవి కాదుగా… తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినవే కదా… కేసులు రాజకీయ కారణాలతోనే పెట్టుండొచ్చు కానీ అక్రమ సంపాదన అన్నది నిజమే కదా… సక్రమంగా అయితే అయిదేళ్లలో లక్షల కోట్లు సంపాదించడం సినిమాల్లో మాత్రమే సాధ్యం… తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్థుల్లో, తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన అధికారంలోనూ తనకు దక్కాల్సిన వాటా దక్కలేదని ఆవిడ, ఇవ్వడానికి ఇష్టం లేక ఈయన… *మంది సొమ్ము మింగేసి ఇప్పుడా వాటాలు తేలక చేసుకుంటున్న రచ్చ తప్ప మరొకటి కాదు*… తన ఆస్తిలో సొంత షెల్లెమ్మకు చిల్లిగవ్వ ఇవ్వరు గానీ, ప్రజల సొమ్ముని రాష్ట్రంలో షెల్లెమ్మలకు ఇష్టానుసారంగా పంచేస్తారు… ఇదంతా ప్రజాసేవే మరి… మీకు అర్థమవుతోందా… 😂😂😂

*సూర్య శ్రీనివాస్ ముసునూరి*

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *