హీరో రెబల్ స్టార్ ప్రభాస్ 45వ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా మధురవాడ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో జయరామ ఆధ్వర్యంలో అభిమానుల మధ్య ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. .ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ప్రభాస్ సినిమా ఇండిస్టీకి వచ్చి ఇప్పటివరకు 23 సినిమాల్లో నటించారని ప్రజలకు కరోనా సమయంలో, ఆపదల సమయంలో కానీ ఏ సమస్య వచ్చినా విరాళాలు ఇచ్చేందుకు ముందు వరుసలో ప్రభాస్ ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జయరాం , చిన్నమ్మానాయుడు ,ఈసు , విశ్వ , హరి , ఆకాష్, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.