OSG NEWS

భూముల మ్యుటేషన్ గిరిజనుల హక్కు

అక్రమ వసూళ్లకు పాల్పడితే సస్పెన్సన్ తప్పదు

గిరిజనులకు సక్రమంగా రేషన్ పంపిణీ

జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ్

 

గిరిజన ప్రాంతంలో భూముల మ్యుటేషన్లు గిరిజనుల హక్కుని గిరిజన భూములను నిర్దిష్టమైన గడువులోగా మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ్ ఆదేశించారు. గురువారం స్థానిక ప్రైవేటు కల్యాణ మండపంలో పాడేరు డివిజన్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుండి మ్యుటేషన్లకు నోటరీ అఫిడవిట్లు తీసుకోవాలసిన అవసరం లేదని స్పష్టం చేసారు. నోటరీ అడుగుతున్నారని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మ్యుటేషన్ చేయడానికి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మ్యుటేషన్ సర్వేకు వెళ్లినపుడు భూ యజనులు ఎవరు ? ప్రస్తుతం భూమి పై ఎవరు సాగులో ఉన్నారని పరిశీలించాలని సూచించారు. సమాచారం పూర్తిగా సేకరించి వి.ఆర్. ఓ లాగిన్ నుండి ఆర్. ఐ. కి ఆర్ ఐ నుండి తాహశీల్దారు లాగినికి పంపించి 30 రోజులలోగా మ్యుటేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. వి. ఆర్. ఓల రిపోర్టు మేరకు మ్యుటేషన్ జరగాలని స్పష్టం చేసారు. తాహశీల్దారుల లాగిన్లో 275 ముటేషన్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అదే విధంగా వి ఆర్ ఓల లాగిన్ లో 84 ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో పేదలకు రేషన్ చాలా ముఖ్యమని రేషన్ పంపిణీలో జాప్యం జరగకూడదన్నారు.
లబ్దిదారులకు సకాలంలో రేషన్ పంపిణీ చేయాలని చెప్పారు. తాహశీల్దారులు రేషన్ షాపులు, ఎం ఎల్ ఎస్ పాయింట్లను తనిఖీ చేసి రేషన్ సక్రమంగా పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ పంపిణీకి వి. ఆర్. ఓలు సమయానికి అథెంటికేషన్ వేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రేషన్ డీలర్లు ఖాళీలు ఉంటే ప్రతిపాదనలు పంపిస్తే భర్తీ చేస్తామని అన్నారు. రేషన్ బియ్యం ఎక్కడైనా పక్కదారి పడితే సంబంధిత సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఎం.డి.యు ఆపరేటర్లను తనిఖీ చేయాలని తాహశీల్దారులకు సూచించారు. భూముల సర్వే సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వే ఫొటోలను సేకరించి తాహశీల్దారు గ్రూపులో పొందుపరచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల పైనే ఉందన్నారు. ప్రభుత్వ భూములు, బంజరు భూములు అన్యాకంతం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. మీకోసంలో స్వీరించిన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. సెల్ టవర్లు నిర్మాణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. సెల్ టవర్ల వలన రేడి యేషన్ ఉండదని జియో అధికారి సత్యా తెలియ జేసారు.

ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, డి. ఆర్. ఓ. బి. పద్మావతి, పి. యం. యు ప్రోగ్రాం అధికారి రాంగోపాల్, 11 మండలాల తాహశీల్దారులు, డిప్యూటీ తాహశీల్దారులు, ఆర్. ఐలు, వి. ఆర్. ఓలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *