తూఫాను బాధిత రైతులకు సంఘీభావంగా పోర్టు వాకర్స్
OSG NEWS 11-12-2024
ఇటీవల సంభవించిన తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలియజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. ప్రసాదరావు బిచ్చగాడు వేషధారణలో రైతులకు సంఘీభావం తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులకు రైతు భరోసా మరియు రుణమాఫీ, రైతు భీమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ లబ్ధిదారులకు సకాలంలో అందకపోవడంతో వ్యవసాయంలో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఆధునిక పనిముట్లు సబ్సిడీతో సమకూర్చి ఆ పంట చేతికి రాగానే సరియైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చెసి వ్యవసాయమే మెరుగని విధంగా ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు